29 నుంచి మెగా క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

29 నుంచి మెగా క్రికెట్‌ టోర్నీ

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

నేటి నుంచి వేసవి సెలవులు

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ క్రీడా మైదానంలో ఈనెల 29 నుంచి మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షారూ, కై ఫ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ జిల్లాల క్రీడాకారులతో ఈ టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టోర్నీలో గెలుపొందిన జట్టుకు మొద టి బహుమతి రూ. 75వేలు, రెండో బహుమతి రూ. 35 వేలు అందజేస్తామన్నారు. ఎంట్రీ ఫీజు రూ. 3,500 చెల్లించి తమ జట్టు పేరు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 7729976116, 8106009317 నంబర్లను సంప్రదించాలన్నారు.

మార్కెట్‌లో రైతుల అందోళన

ఖిలా వరంగల్‌: మార్క్‌ఫెడ్‌ అధికారులు మక్కలు కొనుగోలు చేయాలని వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులు గురువారం ఆందోళన చేశారు. మార్కెట్‌లో మార్కెఫెడ్‌ మక్కల కొనుగోళ్లను నిలిపివేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన మక్కలకు కాంటాలు వేయడం లేదు. మక్కలు నింపేందుకు గన్నీ సంచులు ఇవ్వకపోడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పది రోజులుగా మక్కల కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పందించి మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కాగా, వర్షం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు టార్పాలిన్లు అందజేశారు.

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు గురువారం పేరెంట్స్‌ సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా హెచ్‌ఎంలు వేసవి సెలవుల్లో జాగ్రత్తలపై వ్యవహరించాలని సూచలిచ్చారు. ప్రతీ రోజు కొంత సమయం చదువుకునేలా ప్రోత్సహించాలని, కళలు, క్రీడలు, పెయింటింగ్‌, సంగీతం వంటివి నేర్పించాలని సూచించారు. సంతోషంగా సెలవులు గడిపేలా సురక్షితంగా ఆరోగ్యం ఉండేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈనెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని, మళ్లీ జూన్‌ 12న పాఠశాలు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement