కొనసాగుతున్న శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

కొనసాగుతున్న శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభోవంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారిని సూర్యప్రభవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌ దంపతులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్‌, వరంగల్‌ మహానగర అధ్యక్షుడు బయ్యస్వామి, ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్‌, డాక్టర్‌ ఆలేటి కృష్ణ, వర్ధిని దంపతులు, బున్న మల్లేశం, చొప్పరి సోమయ్య ఉభయదాతలుగా వ్యవహరించారు. శానబోయిన రాజకుమార్‌,మొగిలి, సదయ్య, బండి సారంగపాణి, సాధు రఘు, సత్యనారాయణ. బిల్లా శివకుమార్‌, సత్యనారాయణ, ఉమేష్‌, రాజమౌళి, శ్రీలత, మాధవి. స్వాతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం హంనవాహనంపై ఊరేగించారు. పూజల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, మయూరి, జగన్మోహన్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సూర్యప్రభవాహనం, హంసవాహనంపై అమ్మవారి ఊరేగింపు

Advertisement
 
Advertisement
Advertisement