● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: అర్హులైన జర్నలిస్టులందరికీ 252 జీఓ ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో గురువారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్‌పర్సన్ కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులు, జీఓను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కమిటీ సభ్యులు ప్రయత్నించాలన్నారు. నిజమైన సమాచారాన్ని ప్రజ లకు అందిస్తున్న పాత్రికేయులకు నూతన కార్డులు జా రీచేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఆందోళనకు గురికా కుండా జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డీపీఆర్‌ఓ ప్రేమలత, కమిటీ సభ్యులు శ్రీరాం రాంచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, బొడిగ శ్రీనివాస్, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల సోమేశ్వర్, హుస్సేన్‌పాషా, బొల్లెపల్లి రాజు పాల్గొన్నారు.


