కేయూ క్యాంపస్: గ్రంథాలయాలు విజ్ఞానభాండాగారాలని, విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని హనుమకొండలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ వ్యవస్థాపకుడు ఆచార్య గజ్జల రామేశ్వరం అన్నారు. గురువారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో ప్రపంచ పుస్తక అండ్ కాపీరైట్ దినోత్సవం వేడుకల్లో ‘బుక్స్ యాజ్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ కల్చర్స్, ఐడియాస్ అండ్ జనరేషన్’ అనే అంశంపై ప్రసంగించారు. పుస్తకాలు, సంస్కృతులు తరాల మధ్య అనుసంధానాన్ని కల్పించే శక్తి కలిగి ఉన్నాయన్నారు. తొలుత ఈ పుస్తక ప్రదర్శనను కేయూ పాలకమండలి సభ్యుడు సుదర్శన్ ప్రారంభించారు. కేంద్ర గ్రంథాలయ మెంబర్ ఇన్‌చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి బి.రాధికారాణి, లైబ్రరీ అసిస్టెంట్ టి. జువేర్, బ్రహ్మచారి, శ్రీనివాస్, టి. రవీందర్, చంద్రమోహన్, నవీన్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేచురోపతి లైబ్రరీ వ్యవస్థాపకుడు
రామేశ్వరం


