హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో కార్మికులు పూర్తి స్థా యిలో సమ్మెలోకి వెళ్లారు. ఫలితంగా బస్సులు అరకొరగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ప డ్డారు. కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లగా అధి కారులు, కొందరు కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రా మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. సమ్మెతో బుధవారం వేకువజామున మొదటి బస్సు నుంచి సర్వీస్‌లు నిలిచిపోయాయి. వరంగల్ రీజియన్‌లో ని 8 డిపోల్లో సంస్థకు చెందిన 596 బస్సులకు 592 డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండ, మహబూబాబాద్ డిపోలకు చెందిన రెండేసి బస్సులు రోడ్డెక్కాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వరంగల్–2 డిపోకు చెందిన విద్యుత్ బస్సులు, ప్రైవేటు అద్దె బస్సులను అధికారులు నడిపించారు. సమ్మెలోకి వెళ్లిన కార్మికులు ఉదయమే డిపోలకు వద్దకు చేరుకుని ధర్నాలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె సమాచారంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తు చేపట్టా రు. హనుమకొండ డిపో వద్ద అద్దె బస్సులను నడిపించాలని చూడగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను వారించి బస్సులను పంపించారు. అనంతరం కార్మికులను డిపో ఎదుట ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు పంపించారు. దీంతో వారు అక్కడే నిరసన తెలిపారు. వరంగల్–1 డిపో వద్ద ధర్నా చేశారు. విద్యుత్ బస్సులకు కేటాయించడంతో వరంగల్–2 డిపో పూర్తిగా జేబీఎం నిర్వహణలోకి వెళ్లింది. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. సమ్మె మొదటి రోజు కావడంతో అధికారులు ప్రైవేట్ అద్దె బస్సులను పూర్తి స్థాయిలో తిప్పడంపై దృష్టి సారించారు.
ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం..
హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1 డిపో, రాంనగర్‌లోని హనుమకొండ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
ఔట్ సోర్సింగ్ కండక్టర్లతో నిర్వహణ..
సమ్మె ప్రభావం లేదని చూపడానికి ప్రభుత్వం, యాజమాన్యం తమ ప్రయత్నాలు చేశాయి. సమ్మె మొదటి రోజు రీజియన్ వ్యాప్తంగా 228 బస్సులు నడిపారు. ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యుత్ బస్సులు పూర్తి స్థాయిలో నడిచాయి. ఔట్ సోర్సింగ్ కండక్టర్లతో అద్దె, విద్యుత్ బస్సులు నడిపించారు. బస్టాండ్లలో టికెట్లు జారీ చేస్తూ వన్‌మ్యా న్ సర్వీస్‌గా కొన్ని బస్సులు తిప్పారు. కొన్ని విద్యు త్ బస్సు డ్రైవర్లకు టిమ్‌లు అప్పగించి బస్సులు నడిపారు. మరికొన్ని బస్సులో టికెట్ జారీ చేసే వారు లేకపోవడంతో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచిత ప్రయాణం చేశారు. విద్యుత్ బ స్సులు 115 ఉండగా 79 మాత్రమే నడిచాయి. ప్రై వేట్ అద్దె బస్సులు 325 ఉండగా 145 మాత్రమే తి రిగాయి. మహబూబాబాద్‌లో అద్దె బస్సులు 24 ఉండగా 2 మాత్రమే నడిచాయి. అదే విధగా తొ ర్రూరులో 43 ఉండగా ఒక్కటి మాత్రమే, భూపాలపల్లిలో 24 ఉండగా 9 మాత్రమే, పరకాలలో 23 ఉండగా 7 మాత్రమే నడిచాయి.
వరంగల్ రీజియన్‌లో డిపో వారీగా
నడిచిన బస్సులు
డిపో ఆర్టీసీ అద్దె మొత్తం
బస్సులు నడిచినవి
వరంగల్–1 38 38 –
వరంగల్–2 79 36 115
హనుమకొండ 02 16 18
జనగామ 27 27 –
తొర్రూరు 01 01 –
పరకాల 07 07 –
భూపాలపల్లి 09 09 –
నర్సంపేట 11 11 –
మహబూబాబాద్ 02 02 –
టికెట్ల జారీ కోసం తాత్కాలికంగా ఉద్యోగుల భర్తీ..
మరో వైపు సంస్థ బస్సులను నడిపేందుకు రవాణ శాఖ అధికారుల ద్వారా అర్హులైన డ్రైవర్ల జాబితా సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా రవాణ శాఖ అధికారులకు అర్హులైన, అనుభవం కలిగిన డ్రైవర్లను గుర్తించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. అదే విధంగా టికెట్ల జారీ కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రైవేట్ వ్యక్తులను తా త్కాలిక, రోజువారీ వేతనం ప్రాతిపదికగా తీసుకునేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఆసక్తి కలిగిన వారిని సంప్రదించాలని డిపో మేనేజర్లు ప్రకటన విడుదల చేశారు. వీరికి రోజుకు రూ.800 చొప్పున చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిస్థాయి సమ్మెలోకి కార్మికులు
డిపోలకే పరిమితమైన బస్సులు
అక్కడక్కడ ప్రైవేట్ అద్దె సర్వీస్‌లను అడ్డుకున్న కార్మికులు


