వివిధ పరిశ్రమలకు రుణ పరిమితి ఇలా..
హన్మకొండ: వ్యవసాయానికి బ్యాంకులు అందించే పంట రుణ పరిమితికి రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న సాగు వ్యయం మేరకు అధికారులు, రైతు ప్రతినిధులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటల వారీగా అయ్యే సాగు ఖర్చులపై చర్చించి రుణ పరిమితి ప్రతిపాదనలు రూపొందించి, రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీకి పంపారు. దీంతో కమిటీ రుణ పరిమితికి తుది రూపు ఇచ్చి పంటల వారీగా ఎకరాకు ఇవాల్సిన రుణాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2026–2027 వానాకాలం, యాసంగిలో బ్యాంకులు నూతనంగా ఖరారైన రుణ పరిమితి మేరకు రుణ వితరణ చేస్తాయి. రాష్ట్ర సాంకేతిక కమిటీ సమావేశంలో జరిగిన చర్చల్లో సభ్యులు ప్రతీ జిల్లా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అన్ని ప్రధాన పంటలకు సంబంధించి సాగు విస్తీర్ణం, ఖర్చు, స్థూల దిగుబడి విలువపై సవివరంగా చర్చించి, స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక సహాయ స్థాయిల సూచనాత్మక శ్రేణిని ఆమోదించారు.
పంటల వారీగా ఖరారైన
రుణ పరిమితి (ఎకరాకు)...
వరి ఎకర సాగుకు రూ.48,000 రుణం ఇవ్వాలి. వరి విత్తనోత్పత్తికి రూ.51,000, జొన్న సాగుకు 20,000 నుంచి రూ.22,000, జొన్న విత్తనోత్పత్తికి రూ.26,000, సజ్జ రూ.19,000, రాగి రూ.18,000, మొక్కజొన్నకు రూ.38,000, మొక్కజొన్న (స్వీట్ కార్న్, విత్తనోత్పత్తికి)రూ.43,000, మిల్లెట్స్‌కు రూ.23,000, గోధుమకు రూ.22,000, కందికి రూ.27,000, కంది ఆర్గానిక్‌కు రూ.25,000, మినుములుకు రూ.23,000, మినుము (ఆర్గానిక్)కు రూ.22,000, పెసరకు రూ.20,000, పెసర ఆర్గానిక్‌కు 22,000, శనగకు రూ.28,000, బొబ్బెరకు రూ.13,000, పొద్దు తిరుగుడుకు రూ.32,000, సోయాబీన్‌కు రూ.32,000, సోయాబీన్ విత్తనోత్పత్తికి రూ.38,000, వేరుశనగకు రూ.34,000, నువ్వుకు రూ.23,000, కుసుమలకు రూ.21,000, ఆవాలుకు 15,000, ఆముదకు రూ.22,000, పత్తికి రూ.52,000, పత్తి విత్తనోత్పత్తికి రూ.1,50,000, చెరుకు పంటకు రూ.84,000, ఆయిల్ ఫామ్‌కు రూ.50,000, మిరప పంట సాగుకు రూ.90,000, మిరప (మల్చింగ్)కు రూ.1,00,000, పొగాకు సాగుకు రూ.35,000, టమాటకు రూ.58,000, టమాట మల్చింగ్‌కు రూ.72,000, వంకాయ మల్చింగ్‌కు రూ.58,000, వంకాయ సాధారణ సాగుకు రూ.43,000, చామదుంప సాగుకు రూ.46,000, మునగ సాగుకు రూ.40,000, అల్లం సాగుకు రూ.72,000, స్వీట్ పొటాటో సాగుకు రూ.32,000, పొట్లకాయ సాగుకు రూ.36,000, పొట్లకాయ ఆర్గానిక్‌కు రూ.38,000, ఉల్లిగడ్డకు రూ.49,000, క్యారట్‌కు రూ.36,000, బంగాళదుంపకు రూ.52,000, బెండకు రూ.33,000, కీర దోసకు రూ.36,000, క్యాబేజీకి రూ.36,000 క్యాలీఫ్లవర్‌కు రూ.36,000, కరివేపాకు సాగుకు రూ.26,000, కొత్తిమీరకు రూ.28,000, పుదీనా సాగుకు రూ.35,000, నూరు వరాల పూల సాగుకు రూ.50,000, క్యాప్సికం సాగుకు రూ.53,000, అరటికి (టిష్యూ) రూ.49,000, స్వీట్ ఆరెంజ్‌కు రూ.50,000, నిమ్మ సాగుకు రూ.53,000, దానిమ్మకు రూ.79,000, జామకు రూ.51,000; కస్టర్డ్ ఆపిల్‌కు రూ.42,000, సపోటకు రూ.37,000, ద్రాక్షకు రూ.1,02,000, ద్రాక్ష (సీడ్‌లెస్)కు రూ.1,33,000, బేర్ సాగుకు రూ.36,000; వాటర్ మిలన్‌కు రూ.38,000, మస్క్ మిలన్‌కు రూ .57,000, బొప్పాయికి రూ.70,000; మామిడికి రూ.67,000 నుంచి రూ.98,000 వరకు, కొబ్బరికి రూ .53,000, కోకా సాగుకు రూ.39,000, డ్రాగన్ సాగుకు రూ.82,000 రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది.
రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించిన రుణ పరిమితి మేరకు పౌల్ట్రీ పరిశ్రమ (గుడ్లు) ఒక్కొక్క కోడి పిల్లకు రూ.450 చొప్పున, బాయిలర్ ఒక్కో కోడి పిల్లకు రూ.230 చొప్పున, పాడిపరిశ్రమకు ఒక గేదెకు రూ.37,500, ఆవుకు రూ.38000, గొర్రెలకు (20 ప్లస్ 1) రూ.32,000, మేకలకు (20 ప్లస్ వన్)కు రూ.35,000, పందుల (3 ప్లస్ 1) పెంపకానికి రూ.67,000, చేపల పంపకానికి హెక్టార్‌కు రూ. 40,00,000 చొప్పున రుణ వితరణ చేయాలి.
పెరిగిన సాగు ఖర్చుల మేరకు రుణాలు
రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం


