మేలో టీజీసీపీజీఈటీ– 2026 నోటిఫికేషన్‌! | - | Sakshi
Sakshi News home page

మేలో టీజీసీపీజీఈటీ– 2026 నోటిఫికేషన్‌!

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

కేయూ క్యాంపస్‌: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించబోయే తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీసీపీజీఈటి) 2026 నోటిఫికేషన్‌ మే మొదటివారంలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఈసారి టీజీసీపీజీఈటీని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించబో తోంది. ఈ మేరకు బుధవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ, సీపీజీఈటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. టీజీసీపీజీఈటీ– 2025 ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి, సీపీజీఈటీ– 2026 కన్వీనర్‌ కేయూ ప్రొఫెసర్‌ కె. రాజేందర్‌, రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం తదితరులతో నిర్వహించిన సమావేశంలో సీపీజీఈటీ అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్ష దరఖాస్తు, పరీక్ష నిర్వహణ, షెడ్యూల్‌ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సోషల్‌ సైన్స్‌ డీన్‌ బి. సురేశ్‌లాల్‌, సైన్స్‌ డీన్‌ జి. హనుమంతు, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, ప్రొఫెసర్లు టి. మనోహర్‌, ఎస్‌.జ్యోతి, సీజే శ్రీలత, వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement