● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ: వ్యవసాయ విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు అత్యుత్తమ సేవలు అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో వ్యవసాయ కళాశాల దశమ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అతి ముఖ్యమైందన్నారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతపై నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమా రెడ్డి, వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి జి.అనురాధ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.రవీందర్ నాయక్, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


