టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా, సామాజిక సేవలోనూ తమ ఉద్యోగులు ముందుంటారని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఉద్యోగి తమవంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, వెంకటరమణ, హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు మధుసూదన్, ఆనందం, జీఎం సామ్య నాయక్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రెడ్డి, సెక్రటరీ జనరల్ తాజుద్దీన్ బాబా, ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు నార్ల సుబ్రహ్మణేశ్వర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనా రెడ్డి, జనరల్ సెక్రటరీ పి.మల్లికార్జున్, బాధ్యులు అనిల్ కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


