న్యూస్‌రీల్
భూపాలపల్లి జిల్లా వేదికగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రేవంత్ శ్రీకారం
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనం
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్ గౌడ్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 115 పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య సందర్శించి పర్యవేక్షించారు.
హన్మకొండ అర్బన్: మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి సేవలు అమూల్యమన్నారు. బోధించిన సూత్రాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహ స్వామి, వీరశైవ లింగాయత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధి సీడీఓఈ (దూరవిద్య) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల 2024–2025, 2025–2026 బ్యాచ్‌లు, 2023–2024 బ్యాచ్‌లోని ఎక్స్ అభ్యర్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారంనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ సోమవారం తెలిపారు. ఈనెల 21, 23, 28, 30, మే 2వ తేదీన పరీక్షలు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.
రెండో సెమిస్టర్ పరీక్షలు మే7 నుంచి
మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ 2023–24 బ్యాచ్ విద్యార్థులకు మే 7వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. మే 7, 11, 13, 15, 18, 20వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మొదటి, రెండో సెమిస్టర్లు కలిపి మొత్తంగా 3,766 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్‌ఓ కార్యాలయంలో చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా తస్లీమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర క్రితం బదిలీల్లో భాగంగా యామిని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా రాగా, కొద్ది నెలల తర్వాత ఖమ్మంకు సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వెళ్లారు. నాటినుంచి ఇన్‌చార్జ్‌గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రశాంతి విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత పూర్తిస్థాయి చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా తస్లీమా బాధ్యతలు స్వీకరించగా కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నకర చర్యలను ప్రభుత్వం, యాజమాన్యం ఆపాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీకి ఇచ్చే విధానంలో మార్పులు చేసి కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. జేఏసీతో కలిసి ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్‌కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ అనిల్‌జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు.
సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష..
మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు.
ప్రతిపక్షాలపై నిప్పులు..
అభివృద్ధి, సంక్షేమానికి హామీ..
కాటారం మండలం నస్తూర్‌పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్‌ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్‌అండ్‌టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగా
కుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
నస్తూర్‌పల్లి
బహిరంగ సభలో
అభివాదం
చేస్తున్న
సీఎం
రేవంత్
‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్‌పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో యాసంగి 2026–27 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు, అధికారులున్నారు.
గార్బేజ్ పికింగ్ స్టిక్‌తో చెత్త సేకరణ సులభం
గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా కవర్లు, చిత్తు కాగితాలను సులభంగా సేకరించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. స్టిక్ వినియోగంపై సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్య తను కాపాడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వన మహోత్సవం, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
మందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు
ఎన్‌డీఎస్‌ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం
బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన


