కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీలోని రక్త పరీక్షలకు ఉపయోగించే మిషన్లు మొరాయించడంతో రోగుల పరీక్షల కోసం అటెండెంట్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సీబీపీ, ఏబీజీ మిషన్లు పని చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల పరీక్షలు ఈ ల్యాబ్‌లో చేయాల్సి ఉంది. అయితే, సీబీపీ పరీక్ష కోసం 91వ నంబర్ గదిలోని ల్యాబ్‌కు పేషెంట్ల అటెండెంట్లు బ్లడ్ శ్యాంపిళ్లు తీసుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఇక ఏబీజీ పరీక్షల కోసం మాత్రం ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చిందని పేషెంట్ల కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే పరీక్షల కోసం అధిక డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అయితే సాయంత్రం నుంచి ఏబీజీ మిషన్ పనిచేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
సతాయించిన సీబీపీ, ఏబీజీ మిషన్లు
వైద్య పరీక్షల కోసం సిబ్బంది పరుగులు


