హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ పద్యనాటక కళాకారుడు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్‌శర్మ ‘నాటక మణిచంద్ర’ బిరుదు అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం జనగామలోని సెయింట్ మేరీ స్కూల్‌లో కవులు, కళాకారులు ఐక్యవేదిక ఏడో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్లుట్ల రవీంద్రరావు అధ్యక్షతన జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా శాసనసభ కార్యదర్శి బేతి శివారెడ్డి, డాక్టర్ నామోజు బాలాచారి హాజరై జేఎన్ శర్మకు బిరుదు ప్రదానం చేశారు.


