హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరానికి ఉన్న ఘనమైన చరిత్రను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (వరల్డ్ హెరిటేజ్ డే) పురస్కరించుకుని శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ‘కుడా’, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రా మ్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీవీ పాపారావు, బీపీ ఆచార్య, ప్రొఫెసర్ పాండురంగారావు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. వరంగల్ ప్రత్యేకమైన చారిత్రక ప్రదేశాలు కలిగి ఉన్న నగరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం నగరానికి చెందిన పేరిణి నృత్యగురువు గజ్జెల రంజిత్ శిష్యబృందం చేసిన పేరిణి లాస్యం, పేరిణి శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
వరల్డ్ హెరిటేజ్ డేలో వక్తల పిలుపు
ఆకట్టుకున్న గజ్జెల రంజిత్ శిష్య
బృందం పేరిణి శివతాండవం


