పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
రామన్నపేట: నియోజకవర్గంలో రూ.కోట్ల నిధులతో విస్తృతంగా డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 29వ డివిజన్ పోతననగర్ ప్రాంతంలో యుఐడీఎఫ్ అండ్ సా డ్యూటీ నిధుల ద్వారా రూ.8.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని కలెక్టర్, మేయర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బల్దియా జనరల్ ఫండ్ ద్వారా రూ.1.87 కోట్లతో కుంటి భద్రయ్య దేవస్థానం సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 11వ డివిజన్ పోతన రోడ్డులో రూ. 99.50 లక్షలతో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, మాజీ కౌన్సిలర్ బుద్దజగన్, తదితరులు పాల్గొన్నారు.


