న్యూస్‌రీల్
గ్రేటర్ వరంగల్‌లో జీఐఎస్‌కు కసరత్తు
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్‌లో 3,945 మంది
● ఇంటర్‌లో 7,187 మంది విద్యార్థులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్‌లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్‌లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్‌టికెట్లు సంబంధిత వెబ్‌సైట్(తెలంగాణఓపెన్‌స్కూల్.ఓఆర్‌జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు.
కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల బృందం నేడు (శనివారం) ఉదయం 11గంటలకు సందర్శిస్తారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణరెడ్డి, నడిపల్లి దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జ్యోతితో పాటు ముఖ్య నేతలు సందర్శిస్తారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శనకు రానున్న నేపథ్యంలో ముందుగానే బీఆర్‌ఎస్ బృందం రానుండడంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల మెయిన్ సెంట్రల్ సర్వర్ మొరాయించింది. దీంతో శుక్రవారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 98 స్లాట్లు ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ మొరాయించడంతో శుక్రవారం సెంటిమెంట్‌తో వచ్చిన భూక్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. కాగా, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని సబ్ రిజిస్ట్రార్ సైదులు తెలిపారు. శనివారం సర్వర్ అందుబాటులోకి వస్తే శుక్రవారం నాటి స్లాట్లు రీషెడ్యూల్ చేసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా, శుక్రవారం సర్వర్ మొరాయించడంతో ఖజానాకు భారీగా ఆదాయం గండిపడినట్లు అయ్యింది.
కాజీపేట: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) వరంగల్‌లో నేడు శనివారం ఉదయం 10.30 గంటలకు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. కాజీపేట ఐటీఐ భవనంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పేరొందిన ఎల్‌అండ్‌టీ కంపెనీతో పాటు 5 కంపెనీలు జాబ్‌మేళాకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జాబ్‌మేళాకు రావాలని సూచించారు. ఎంపికై తే శిక్షణతో పాటు శాశ్వత ఉద్యోగావకాశం కల్పించేందుకు కంపెనీలు సి ద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు అనిల్‌కుమార్ 70133 97132, ఎండీ వాసిక్ 9533354944, బి.బాలస్వామి 95333 96401 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు బంక సరళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొంటున్నారని తెలిపారు. ఈపార్టీ ముఖ్య నేతలు పాల్గొనే సమావేశానికి మహిళా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సరళ కోరారు.
హన్మకొండ: గ్రామాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను నవీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ప్రజాపరిషత్ కార్యనిర్వహణాధికారులు, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం 2025 జూలై 10 వరకు ఎన్‌రోల్ చేసుకున్న ఓటర్లతో తయారు చేసిన తుది జాబితాను 2025 సెప్టెంబర్ 2న విడుదల చేసింది. అనంతరం 2026 ఫిబ్రవరి వరకు నూతనంగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారి వివరాలతో తుది జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. పరిశీలనలో ఏమైనా వ్యత్యాలు గుర్తిస్తే ఈ నెల 23లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఓటర్ల జాబితా కచ్చితత్వంతో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
తాగునీటి కోసం రోగుల తండ్లాట
ప్రాణాలు నిలుపుకునేందుకు వచ్చే రోగులు ఆస్పత్రుల్లో నీరు దొరక్క అల్లాడుతున్నారు. గ్రేటర్ నగరంలోని ఎంజీఎం, జీఎంహెచ్, సీకేఎం ఆస్పత్రుల్లో అంతంత మాత్రంగానే ఏర్పాటు చేసిన నల్లాలు రోగుల దాహార్తి తీర్చట్లేదు. రోగుల బంధువులు తాగు నీటి కోసం ఆస్పత్రుల చుట్టూ ఉన్న దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. లీటర్ రూ.20 చొప్పున రోజుకు నాలుగైదు బాటిళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులు పడుతున్న తాగునీటి తండ్లాటపై ‘సాక్షి’ ఆయా ఆస్పత్రుల్లో శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
– హన్మకొండ చౌరస్తా/
కాశిబుగ్గ
పనిచేయని నీటి
శుద్ధి కేంద్రం
హనుమకొండలోని జీఎంహెచ్‌లో పోలీసులు కొంటున్న మినరల్ నీళ్లు
ఎంజీఎంలో నీటి కోసం...
అలంకారప్రాయంగా ఆర్‌ఓ ప్లాంట్
వేసవిలో పేషెంట్లు, అటెండెంట్లకు అవసరమైన తాగునీటి సరఫరా చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ ఆస్ప్రతిలో ప్రారంభించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ మూలన పడింది. దాదాపు ఏడాదికిపైగా ఈ ప్లాంట్‌ను మరమ్మతు చేయించకుండా అలాగే వదిలేశారు. కనీసం వేసవిని దృష్టిలో పెట్టుకునైనా మరమ్మతులు చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. నగర మేయర్ గుండు సుధారాణి గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు ప్రారంభించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తోంది. దీనిద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు రోగులకు సరిపోవట్లేదు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ద్వారా తాగునీళ్లు వాడుకుంటున్నప్పటికీ నీళ్లు అందరికీ అందట్లేదని అటెండెంట్లు వాపోతున్నారు. పూర్తిగా తాగునీటి సదుపాయం లేకపోవడంతో బయట దుకాణాల్లో బాటిళ్లు కొంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఆస్పత్రిలో సుజల్ పథకం అమలు కావట్లేదు.
ఎంజీఎంలో..
పేదల ఆస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలో తాగునీరు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. పలు వార్డుల్లో నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ నీళ్లు సరిగ్గా రావట్లేదు. దాతలు బహూకరించిన రెండు వాటర్ కూలర్లు ఓపీతో పాటు ఏఎంసీ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే వీటి ద్వారా 24 గంటలు తాగునీరు రావట్లేదని తెలుస్తోంది. కిచెన్ షెడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన తాగునీటి పాయింట్ వద్ద రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తీర్చడానికి ఇక్కడ ప్రత్యేకంగా మూడు చలివేంద్రాల ద్వారా చల్ల టి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈఎన్‌టీ విభాగం పక్కనే ఉన్న వాటర్ కూలర్ ద్వారా సన్నటి ధార మాదిరిగా నీళ్లు రావడంతో తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఒక రూపాయికి ఒక లీటర్ మినరల్ వాటర్, సుజల్ ఏటీడబ్ల్యూ ద్వారా కూల్ వాటర్‌ను రూ.2కు అందజేస్తున్నారు. దీంతో అటెండెంట్లు దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తేనే పూర్తి స్థాయిలో తాగనీరందుతుంది.
జీఎంహెచ్‌లో రోగులకు సంపు
నీటినందిస్తున్న వాటర్ కూలర్
సీకేఎంలో
పని చేయని నల్లా
ఆస్పత్రిలోని మెడికల్ షాపు వద్ద నీటిని కొంటున్న మహిళ
ఉద్యోగ సంఘాల జేఏసీ
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరుబాటలో భాగంగా శుక్రవారం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. నిరసనలో జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్‌మోహన్‌రావు, జేఏసీ కో–చైర్మన్ లింగారెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అకవరపు శ్రీనివాసకుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తిరుపతిరెడ్డి, సంఘాల ప్రతినిధులు పెండెం రాజు, సర్వర్ హుస్సేన్, గోపాల్ రెడ్డి, సీతారాం, డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేశ్, కోల రాజేశ్‌కుమార్, వెంకటేశ్వర్లు, అన్వర్, సురేశ్, రఘుపతిరెడ్డి తదితరులున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్ :
..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్‌ఐలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండడం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి సన్‌ప్రీత్‌సింగ్.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్‌లోని ఇన్‌స్పెక్టర్(ఎస్‌హెచ్‌ఓ)లు, ఎస్‌ఐలపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారట్లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు.
వరుస ఘటనలతో కలకలం..
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడడం, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్ కమిషనర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్‌ను సస్పెండ్ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధి కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీశ్ సస్పెన్షన్‌పైనా చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్‌ను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను ఏఆర్‌కు అటాచ్ చేశారు. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది.
సీరియస్‌గా ‘లేఖల’ పంచాయితీ..
గతేడాది డిసెంబర్‌లో వరంగల్ పోలీస్ డివిజన్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడొచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధి నలుగురు ఇన్‌స్పెక్టర్ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం వంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్‌హెచ్‌ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్ చేయడమా? వీఆర్‌కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడ మా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.
వరంగల్ అర్బన్: మహా నగర భౌగోళిక స్వరూపం అరచేతిలోకి రానుంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్)కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో తాజ్ దక్కన్ హోటల్‌లో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జీఐఎస్ ఏర్పాటుకు రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, జగిత్యాల, జడ్చర్ల మున్సిపాలిటీలు ఉండగా, అందులో గ్రేటర్ వరంగల్‌కు స్థానం లభించింది. నూతన విధానంతో నగర సమగ్ర సమాచారం అరచేతిలో ఇమిడిపోనుంది. నగరంలో ఏ ప్రదేశానికి సంబంధించిన సమాచారం కావాలన్నా క్షణాల్లో కళ్ల ముందుంచేలా రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఆధునిక మ్యాపింగ్ వ్యవస్థతో బల్దియా ఆస్తి పన్ను కొలతల లెక్క పక్కాగా తేలనుంది. 3డీ మ్యాపింగ్ విధానం సైతం అందుబాటులోకి రానుంది. ఇందులో హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
జీఎంహెచ్‌లో కొనకతప్పదు!
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, వారికి సహాయకులుగా వచ్చే వారు తాగునీరు (శుద్ధజలం)ను కొనాల్సిందే. వంద పడకల సామర్థ్యం గల ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో సుమారు పదేళ్ల క్రితం ఎస్‌బీహెచ్ వారు బహూకరించిన రిఫ్రిజిరేటర్ ఉంది. దాని ద్వారా మున్సిపల్ సంపు నీరును అందిస్తున్నారు.
పనిచేయని శుద్ధ జల కేంద్రం
ఆస్పత్రిలో లీటరుకు రూ.2 చొప్పున విక్రయించే శుద్ధ జల కేంద్రం పనిచేయడం లేదు. సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఈ యంత్ర నిర్వహణను ఆస్పత్రి ఉన్నతాధికారులు గాలికి వదిలేశారు.
ఆస్పత్రి ఆవరణలోనే వ్యాపారం..
ఆస్పత్రిలో నీటి కొరతను అదునుగా ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని ప్రధాన ద్వారం ఎదుట ఉన్న మెడికల్ షాపు యాజమాని రూ.10కి రెండు లీటర్ల చొప్పున నీటిని అమ్ముతూ యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుటే నీటి వ్యాపారం సాగుతున్నప్పటికీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు కనీసం చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కాగా, ఆస్పత్రి ఆవరణలోని పోలీస్ ఔట్ పోస్ట్ పోలీసులు ప్రతీ రోజు రెండు వాటర్ క్యాన్లను కొంటున్నట్లు చెబుతున్నారు. నెలకు రూ.300ల నుంచి రూ.400ల వరకు తాగునీటికి వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒక రంజన్ సరిపోతుందా?
ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల దాహార్తి తీర్చేందుకు పోలీస్ ఔట్‌పోస్ట్ పక్కనే ఒక రంజన్, రెండు గ్లాసులు ఉంచారు. వంద పడకల సామర్థ్యం గల ఆస్పత్రికి ప్రతీ రోజు గర్భిణులు, బాలింతలు, సహాయకులతో కలిసి దాదాపు 500 మంది వస్తుంటారు. వారందరికీ ఒకే రంజన్ నీళ్లు సరిపోతాయా? అనేది ఆస్పత్రి అధికారులే ఆలోచించాలి.
సీకేఎం, ఎంజీఎం ఆస్పత్రుల్లో తీరని దాహం
హనుమకొండ ప్రసూతి ఆస్ప్రతిలో
మూలనపడ్డ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్
బయటినుంచి కొనుగోలు చేస్తున్న రోగులు
రెండు లీటర్లకు రూ.10 తీసుకున్నడు
మా మనుమరాలిని చూసేందుకు వచ్చా. తాగేందుకు నీళ్లు లేవంటే ఎదురుగా మందుల షాపు వద్ద రూ.10 ఇచ్చి రెండు లీటర్ల నీళ్లు కొన్నా. మా పక్కన ఉన్న వాళ్లు కూడా మూడు రోజులుగా నీళ్లు కొంటున్నారు. లోపల ఫ్రిడ్జ్ నుంచి వచ్చే నీరు బాగాలేదు. అందుకే బయట కొంటున్నాం. – సత్తెమ్మ, తాటికొండ
తాగునీటి సమస్య లేదు
ప్రతీ రోజు సుమారుగా 200ల మంది గర్భిణులు, బాలింతలు, ఇతర గైనిక్ సమస్యలతో బాధపడే మహిళలు ఓపీ కోసం వస్తుంటా రు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందిస్తున్నాం. తాగునీరు ఇతర సదుపాయాలు కలెక్టర్ సైతం పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్,
ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండ
యువ ఎస్‌ఐల అత్యుత్సాహం..
అడ్డంగా బుక్కవుతున్న పరిస్థితి
అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే..
వరుస ఘటనలతో
పోలీస్ శాఖలో కలకలం
పలువురిపై సస్పెన్షన్, బదిలీ వేటు
ఇన్‌స్పెక్టర్లపైనా ఆరోపణలు..
విచారణ స్థాయిలో ఫిర్యాదులు
చర్చనీయాంశంగా
కొందరు పోలీసుల తీరు


