అరైవ్–అలైవ్ కార్యక్రమంలో
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వేగం కాదు.. జాగ్రత్తే మనల్ని గమ్యానికి సురక్షితంగా చేరుస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అరైవ్–అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించిన వాహనదారులను గులాబీపూలతో అభినందించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, ఆర్టీఓ శోభన్‌బాబు, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ అమలు చేయాలి
నో హెల్మెట్.. నోపెట్రోల్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంకు యజమాన్యాలను కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌లో శుక్రవారం పెట్రోల్‌బంక్ యజమానులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు పెట్రోల్ బంక్ యజమానులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. సమావేశంలో బంక్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు.
గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
ఏప్రిల్ 20–26 తేదీల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై కలెక్టరేట్‌లో సమీక్షించారు.
చిన్నారుల భవిష్యత్తే అభివృద్ధికి పునాది
ఖిలా వరంగల్: చిన్నారుల భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్‌లోని శంభునిపేట, గుంటూరుపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, రిపీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


