బీజేపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రజలకు బీజేపీ మంత్రులు, తేజస్వి సూర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపడం మానుకుని సమానత్వంతో వ్యవహరించాలని కోరారు.

వ్యాఖ్యలు హాస్యాస్పదం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హనుమకొండ వేదికగా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల మనో భావాలను దెబ్బతీసేలా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే వాటిని సమర్థించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీ నేతలకు వరంగల్‌ ప్రజలు తగిన బుద్ది చెబుతారని వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.

డీసీసీ చీఫ్‌ ఇనగాల

ఎమ్మెల్యే నాయిని

Advertisement
 
Advertisement
Advertisement