కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకే టెక్నికల్ ఫెస్ట్ దోహదం చేస్తుందని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మూడు రోజుల టెక్నికల్ ఫెస్ట్ ‘అథెరా 2026’ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సాంకేతిక, సాంస్కృతిక క్రీడాకార్యక్రమాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ ఉత్సవం విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతుందన్నారు. తొలిరోజు ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పేపర్ ప్రజెంటేషన్లు వంటి సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 18న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈనెల 19న పూర్వవిద్యార్థుల సమ్మేళనం, వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ, నిట్ ప్రొఫెసర్ పి.శ్రీహరి రావు, కన్వీనర్లు డాక్టర్ బి.రాధిక, ఎండీ ఆసిం ఇక్బాల్, కె.సుమలత, వి.మహేందర్, ఎన్.సత్యప్రసాద్, కె.శ్రీధర్‌కుమార్ పాల్గొన్నారు.


