సీకేఎం కళాశాలలో మూడు కొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

సీకేఎం కళాశాలలో మూడు కొత్త కోర్సులు

Apr 18 2026 7:17 AM | Updated on Apr 18 2026 7:17 AM

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటలోని ప్రభుత్వ సీకేఎం డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి మూడు నూతన డిగ్రీ కోర్సులు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ డె యిరీ అండ్‌ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్‌, బీకాం హ్యూమన్‌ రిసోర్స్‌ ఆపరేషన్స్‌ అనే కొత్త కోర్సులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. అడ్మిషన్ల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ అనుసరించి ఆన్‌లైన్‌లో వరంగల్‌ సీకేఎం కళాశాలను సెలెక్ట్‌ చేసుకుని, విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, విజయ్‌పాల్‌రెడ్డి, దోస్త్‌ అండ్‌ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ సతీశ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్‌ అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌, పాషా, స్రవంతి, హరిబాబు, మమత, జయంతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement