కేయూ క్యాంపస్: విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్ )యువజనోత్సవాలు దోహదం చేస్తాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పరిపాలనా భవనంలోని సెనెట్ హాల్‌లో నిర్వహించిన యువజనోత్సవాల ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటుగా సాంస్కృతి ప్రతిభను కూడా పెంపొందించుకోవాలన్నారు. పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, కేయూ స్డూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల కోఆర్డినేటర్లు ప్రసన్నకుమార్, అనిల్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూనివర్సిటీ స్థాయిలో వ్యాసరచన, వృక్తత్వ పోటీలు, పద్య రచన, క్విజ్, డిబేట్, రంగోళి, పోస్టర్ పేయింటింగ్, సోలో ఇన్‌స్ట్రుమెంటేషన్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహించారు. 12 ఈవెంట్స్‌లతో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు వీసీ ప్రతాప్‌రెడ్డి బహుమతులను అందజేశారు.
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
ఖిలా వరంగల్: ఖిలావరంగల్ మధ్యకోటలోని ఓ రహస్య స్థావరంలో ఐపీఎల్ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులకు శుక్రవారం పక్కా సమాచారం అందింది. ఆ స్థావరంపై ఆకస్మికంగా దాడిచేసి ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి వారినుంచి రూ.1.02లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తదిపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.
● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి
● ఉత్సాహంగా ఎన్‌ఎస్‌ఎస్ యువజనోత్సవాలు


