న్యూశాయంపేట: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ రాంకిషన్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, హెల్త్ స్కీం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పాతపెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఫణికుమార్, రాంరెడ్డి, వేణుగోపాల్, రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రియాజుద్దీన్, మధులిమియో, సాంబయ్య, అశోక్, గోవిందరాజు, ధర్మరాజు, కిషన్, సోమయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్–పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో హనుమకొండ ఆర్‌డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ రాంకిషన్
కలెక్టరేట్ ఎదుట నిరసన


