హన్మకొండ/ వరంగల్ చౌరస్తా/మామునూరు : వరంగల్ నగర అ భివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నారీ శక్తి వంధన్ అధినియం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎన్.రాంచందర్ రావు ప్రారంభించారు. అలాగే, వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో, రాత్రి తిమ్మాపురంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పంజాబ్‌కు తరలిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం వరంగల్‌కు తీసుకొచ్చిందన్నారు. అ జాంజాహి మిల్లు మూసివేస్తే కేంద్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు తీసుకొ చ్చిందన్నా రు. స్మార్ట్‌సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూ పర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, వేయి స్తంభాల దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్‌ను గాలికి వదిలేసిందని విమర్శించారు.కాగా, శ్రమజీవుల పక్షాన బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదేవిధంగా హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంట రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, దేవేందర్ రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, నవీన్, హరిశంకర్, రఘునా రెడ్డి, రత్న లక్ష్మి, కోమల, వసంత, జరీనా, ఉషా రెడ్డి, ధనలక్ష్మి, కవిత, కరుణ, కార్పొరేటర్ జలగం అనిత, రంజిత్, బన్న ప్రభాకర్, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతి పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు


