హన్మకొండ చౌరస్తా: సీబీఎస్‌ఈ బోర్డు బుధవారం ప్రకటించిన పదో పరీక్ష ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఎస్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్ విద్యా సంస్థలకు చెందిన బొక్క హర్షవర్ధన్ (28145278) జాతీయ స్థాయిలో 491/500 మార్కులు సాధించినట్లు తెలిపారు. వంగపెల్లి సంహిత(28145399) జాతీయ స్థాయిలో 485/500 మార్కులు, పెంచాల క్షేత్రిక(28145396) 482 /500 మార్కులు, బానోత్ వర్షిత్(28145277) జా తీయ స్థాయిలో 482/500, బానోత్ సుదేష్న (28 160170) 480/500 మార్కులు సాధించి ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో నిలబెట్టారని హ ర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జేఈఈ (మెయి న్)–2026 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థుల అందరికీ స్పూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఈ విజ యం సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన తల్లి దండ్రులు, అధ్యాపక బృందాన్ని అభినందించారు. అభినందించిన వారిలో డైరక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి ఉన్నారు.


