రైల్వే సీసీఎస్‌ సభ్యుల ఆర్థిక భరోసే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైల్వే సీసీఎస్‌ సభ్యుల ఆర్థిక భరోసే లక్ష్యం

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

కాజీపేట రూరల్‌: రైల్వే ఎంప్లాయీస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (రైల్వేఈసీసీఎస్‌) సభ్యుల ఆర్థిక భరోసే ప్రధాన లక్ష్యంగా సీసీఎస్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆ సొసైటీ సికింద్రాబాద్‌ జోన్‌ ప్రెసిడెంట్‌ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో మంగళవారం రాత్రి 11 మంది సీసీఎస్‌ సభ్యుల నామిని కుటుంబాలకు సుమారు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకు స్వామి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో 42 వేలపై చిలుకు సీసీఎస్‌ సభ్యులు ఉన్నారని, రూ.2 వేల కోట్ల టర్నోవర్‌తో సీసీఎస్‌ నడుస్తోందన్నారు. సభ్యుల సంక్షేమం కోసం, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాజీపేట సీసీఎస్‌ డైరెక్టర్లు డి.శ్రీనివాస్‌యాదవ్‌, దేవులపల్లి రాఘవేందర్‌, బెల్లంపల్లి సీసీఎస్‌ డైరెక్టర్‌ ఓ.వై.స్వామి, తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే సీసీఎస్‌

ప్రెసిడెంట్‌ చిలుకుస్వామి

Advertisement
 
Advertisement
Advertisement