హసన్‌పర్తి: సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థలు విజయదుందుభి మోగించాయి. పాఠశాల విద్యార్థులు వరుసగా 492 మార్కులు, 492 , 490 ,489 ,488 ,488, 488 ,487 ,484 ,482, 480 మార్కులు సాధించినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఇంటర్‌తో పాటు సీబీఎస్‌ఈ ఫలితాల్లో కూడా ఏకశిల విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈసందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్‌రెడ్డి, గౌరు సువిజారెడ్డి, చిదురాల దినేశ్‌రెడ్డి, చిదురాల శ్రావణిరెడ్డి,వైస్ ప్రిన్సిపాల్స్ బాబా, కెడి స్వర్ణ రాజ్, రాంప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


