‘తేజస్వి’ విద్యార్థుల విజయకేతనం.. | - | Sakshi
Sakshi News home page

‘తేజస్వి’ విద్యార్థుల విజయకేతనం..

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

‘తేజస్వి’ విద్యార్థుల విజయకేతనం..

కాజీపేట అర్బన్‌ : హంటర్‌రోడ్డులోని తేజస్వి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు బుధవారం వెలువడిన సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు తేజస్వి విద్యా సంస్థల అధినేత రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన శ్రీ వైభవి దుడుక 486 మార్కులు, అవ్ని బిజ్జాల 485, విష్ణుప్రియ చింతం 480 మార్కులు సాధించి తేజస్వి కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో నిలబెట్టారని తెలిపారు. 35 మంది విద్యార్థులు 90 శాతంపైన, 42 మంది విద్యార్థులు 80 శాతంపైన, 34 మంది 70 శాతంపైన, 23 మంది 60 శాతం, 10 మంది 60 శాతంలోపు మార్కులు సాధించారని తెలిపారు. ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌పై శ్రధ్ధ తీసుకుంటామని తెలిపారు. పాఠశాల డైరెక్టర్లు రేవూరి భగవాన్‌రెడ్డి, ముదిగంటి అన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement