కాజీపేట: తాళ్ల పద్మావతి స్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం తెలిపారు. ఆసియా 485, నిత్య 473, కార్తీక 472, నిగ్నేశిత 469, పూర్వి దహారియా 461, హేమంత్ రెడ్డి 462, విగ్నేస్ రెడ్డి 462 మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచారని పేర్కొన్నారు. విద్యారంగంతో పాటు ఇతర ప్రతిభా రంగాల్లోనూ రాణిస్తున్న విద్యార్థులను చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, డాక్టర్ వరుణ్, వైష్ణవిలు అభినందించారు.


