వేసవిలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వేసవిలో జాగ్రత్తలు పాటించాలి

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

వేసవిలో జాగ్రత్తలు పాటించాలి

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

రామన్నపేట: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాధాన కూడళ్లలో వ్యాపారులకు ఆయన వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆశాభోంస్లేకు నివాళి

హన్మకొండ కల్చరల్‌: వరల్డ్‌ పీస్‌ సొసైటీ, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమకొండలోని శ్రీసాయిమీరా కళామందిరంలో ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే సంతాపసభ నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభకు పలువురు కవులు, కళాకారులు, గాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరై ఆశాభోంస్లేకు నివాళులు అర్పించి ఆమె జ్ఞాపకాలు, పాటలను స్మరించుకున్నారు. ర్యక్రమంలో కాకతీయ విశ్రాంతాచార్యులు విజయబాబు, పోతానా చారి, ఏసీపీ విజయ్‌కుమార్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ. 7.65 లక్షల ఓపీఎం పట్టివేత

ఖిలా వరంగల్‌: నిషేధిత ఓపీఎం (నల్లమందు) విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 7.65లక్షల విలువైన 1.530 కిలోల సరుకు, స్కూటీ, రెండు మొబైళ్లు స్వాఽధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌ తెలిపారు. రాజస్థాన్‌లోని జీజీవాల్‌ కంకర్ల గ్రామానికి చెందిన గాషిరామ్‌, దినేష్‌ దేశాయిపేట్‌రోడ్‌లో మిఠాయి షాపు నడిపిస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రాజస్థాన్‌ జోధాపూర్‌లో రైతులు ఓపీఎంను సాగుచేస్తుంటారు. ఆ నల్లమందును వరంగల్‌లో తక్కువ ధరకు విక్రయిస్తే లక్షలు సంపాదించొచ్చని ఆ రాష్ట్రానికి చెందిన సునీల్‌ వద్ద నుంచి రూ. 7.65 లక్షల విలువైన సరుకును రూ.50వేలకే కొనుగోలు చేశారు. బుధవారం కాశీరాం, దినేష్‌ కరీమాబాద్‌లో విక్రయించేందుకు రాగా మిల్స్‌కాలనీ ఎస్సై శ్రవణ్‌కు అనుమానస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిషేదనల్ల మందు విక్రయించేందుకు వచ్చామని ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి రూ. 7.65 లక్షల విలువైన 1.530 కిలోల సరుకు, స్కూటీ, రెండు మొబైళ్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసిటన్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement