సాక్షి, వరంగల్: డీలిమిటేషన్ (పునర్విభజన)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతూ ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. వరంగల్ నగరంలో బుధవారం జరిగిన వివిధ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ 2011 జనాభా లెక్కల ప్రకారం రాజ్యాంగంలోని నిబంధనల మేరకు డీలిమిటేషన్ చేస్తున్నారని, అయితే రాజ్యాంగంపై అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల పేరుతో విభజన తీసుకువస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగదని, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను సమాన దృష్టితో చూసేలా పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయన్నారు. 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్నప్పుడు డీలిమిటేషన్ చేశారని, ఆనాడు ఎవరూ కూడా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. సీ ఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారని, ఇదీ ఎవరికీ చెప్పి చేశారని పేర్కొన్నారు.
నెహ్రూ కుమార్తె కావడం వల్లనే
ఇందిర ప్రధాని కాగలిగారు...
ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంట్‌లో రాజ్యంగబద్ధమైన మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెడుతోందని, గత 30 ఏళ్లకు పైగా నానుతున్న ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తుండడంతో మహిళలకు ఆర్థిక,సామాజిక, సాధికారత లభిస్తుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కావడం వల్ల పార్టీ అధ్యక్షురాలు ప్రధాన మంత్రి అయ్యారని, అదే తరహాలో రాజీవ్‌గాంధీ సతీమణి సోని యాగాంధీకి పార్టీ పగ్గాలు వంశపరంపార్యంగా వచ్చాయని గుర్తు చేశారు. గిరిజన మహిళకు అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి అప్పగించింది బీజేపీనేనని గుర్తు చేశారు. బీజేపీలో మహిళల ప్రాతినిధ్యంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు.
హైదరాబాద్‌ను మూడు ముక్కలు
ఎవరికీ చేసి చెప్పారు
వరంగల్ పర్యటనలో బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు


