● కలెక్టర్‌ను కలిసిన జేఏసీ నేతలు
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం పోరుబాట ప్రారంభిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈమేరకు బుధవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఈనెల 17న భోజన విరామ సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మే 5న జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూన్ 2లోపు పీఆర్సీ ప్రకటించడం, పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లించడం, హెల్త్ కార్డులు జారీ చేయడం, సీపీఎస్ రద్దు చేయడం సహా అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ఆకవరపు శ్రీనివాసకుమార్, బైరి సోమయ్య, అన్వర్, పెండెం రాజు, కె.శ్రీనివాస్, సర్వర్ హుస్సేన్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, కోమల్ రెడ్డి, భాను ప్రకాశ్‌రెడ్డి, సబీర్, సీతారాం, సరస్వతి, శ్యాంసుందర్, మల్లారెడ్డి, రవిప్రకాశ్, విజయ్ కుమార్, రాజమౌళి, రజిత, నాగరాణి, అశోక్, ప్రణయ్, పృథ్వీ, అఫ్జల్, కుమారస్వామి, వీరన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు.


