ఖిలా వరంగల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన – ప్రగతి కార్యాచరణలో భాగంగా వరంగల్ ఉర్సు రంగలీల మైదానం జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా రవాణాశాఖ, ట్రాఫిక్, మిల్స్‌కాలనీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ శుభం ప్రకాశ్, వరంగల్ జిల్లా ఇన్‌చా ర్జ్ ఆర్టీఓ శోభన్‌బాబు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, తహసీల్దార్ ఇక్బాల్, విద్యార్థులతో ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలి
న్యూశాయంపేట: రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందుకు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణాశాఖ, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో బుధవారం అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


