● బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంట్ షాక్ తప్పదని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్లు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు, హనుమకొండ ములుగు రోడ్డులోని ట్రాన్స్–కో జోనల్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు దాస్యం వినయ్‌భాస్కర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే ఆర్టిజన్లతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జెడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, నాయకులు జోరిక రమేశ్, పులి రజనీకాంత్, గొర్రె విజయ్, ఈసంపల్లి సంజీవ, టీఎస్‌ఈఈయూ–327 వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్యగౌడ్, హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, యూనియన్ నాయకులు సంఘీబావం తెలిపారు. ఈ సమ్మెలో ఆర్టిజన్ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్ వర్కర్‌లు పాల్గొన్నారు.


