● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీ డియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన కేజీబీవీలు, మోడల్ స్కూల్–కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు బుధవారం కలెక్టరేట్‌లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కు చెందిన 36 మంది మెరిట్ విద్యార్థులు, ఆయా కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌వీ.గిరిరాజ్ గౌడ్, జీసీడీఓ సునీత, వివిధ కళాశాలల అధ్యాపకులు, మెరిట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


