కాజీపేట: కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్క మూలగణపతి దివ్యక్షేత్రాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి సునీత కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొలువుదీరిన 29 దేవతామూర్తుల వివరాలు, ఆలయంలో జరుగు పూజలు, ఉత్సవాల జరుగు తీరును ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ.. న్యాయమూర్తికి వివరించారు. స్వామి వారి శేషవస్త్రాలతో పాటు చిత్రపటాన్ని అందించి పాలక మండలి సభ్యులు సాయికృష్ణ శర్మ సత్కరించారు.
కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని రాణించాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిరోజు క్రికెట్ పోటీలను వీసీ ప్రతాప్‌రెడ్డి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. పదిరోజుల పాటు జరిగే ఈక్రీడల్లో వాలీబాల్, అథ్లెటిక్స్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మా మిడాల ఇస్తారి, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంజన్ శ్రీనివాస్, రాధిక తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: అర్హత కలిగిన కంటి వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఆప్టికల్ షాపుల వారు కంటి అద్దాలు తయారు చేసివ్వాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని ఆప్టికల్స్‌కు సంబంధించిన పలు షాపులను ఆయన తనిఖీ చేశారు. ఆప్టికల్స్ షాపులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తామని బోర్డులు ప్రదర్శించకూడదన్నారు. ఈ తనిఖీలో స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, రంజిత్ పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల చరిత్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ అరూరి రంజిత్‌కుమార్ రచించిన ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ 1956–14’ పుస్తకాన్ని బుధవారం కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, డీన్ సురేశ్‌లాల్, హిస్టరీ విభాగాధిపతి రాజ్‌కుమార్, విశ్రాంత ఆచార్యులు దయాకర్‌రావు, అధ్యాపకులు చందర్‌రావు, రాజేందర్‌రెడ్డి, అరూరి సూర్యం, కె.రాజయ్య, అరూరి రంజిత్ పాల్గొన్నారు.


