విగ్రహాల ఏర్పాటుకు కృషి | - | Sakshi
Sakshi News home page

విగ్రహాల ఏర్పాటుకు కృషి

Apr 16 2026 9:48 AM | Updated on Apr 16 2026 9:48 AM

విగ్రహాల ఏర్పాటుకు కృషి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలోని విష్ణు, సూర్య ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని, పునఃప్రతిష్ఠ కోసం కేంద్రానికి నివేదిక అందజేస్తానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు అన్నారు. వరంగల్‌ పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రేశ్వరస్వామికి పూజల అనంతరం అర్చకులు మహదాశీర్వచం అందించారు. అనంతరం ఆయన ఆలయాన్ని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement