బావి నుంచి యువకుడి మృతదేహం వెలికితీత | - | Sakshi
Sakshi News home page

బావి నుంచి యువకుడి మృతదేహం వెలికితీత

Apr 15 2026 7:20 AM | Updated on Apr 15 2026 7:20 AM

ఖిలా వరంగల్‌: వేసవి తాపం తట్టుకోలేక స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సదరు యువకుడి మృతదేహం వెలికితీశారు. మిల్స్‌కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ ఉర్సు ప్రతాప్‌నగర్‌కు చెందిన ఆకునూరి రాజేందర్‌ కుమారుడు మనీశ్‌ (19) తన ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం హంటర్‌ రోడ్డులోని గణపతి కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు ఈతకు వెళ్లాడు బావిలోకి దిగిన ముగ్గురు క్షేమంగా బయటపడగా.. మనీశ్‌ నీటిలో మునిగి చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా బావి నుంచి మృతదేహం బయట తీయలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మృతదేహాం తేలడంతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బయటకు తీశారు. దీంతో కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. తండ్రి రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement