వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటపురం(కె) మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో మిర్చి బస్తాలు ప్రమాదవశాత్తు దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. బాధిత రైతు నవీన్ కథనం ప్రకారం.. బెస్తగూడెం గ్రామ శివారులో రైతు మిర్చి కోత కోయించి 58 బస్తాల్లో నిల్వ చేశాడు. కాగా, తన చేను పక్కనే ఉన్న మొక్కజొన్న పంట పనులు పూర్తయ్యాయి. మొక్కజొన్న పంటను సాగుచేసిన రైతు చేనుకు నిప్పు పెట్టాడని తెలిపాడు. మొక్కజొన్న మంటలు గాలికి మిర్చి బస్తాలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో మిర్చి బస్తాలు పూర్తిగా కాలిపోయి రూ.రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని నవీన్ కోరాడు.


