విద్యారణ్యపురి: మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఎంత అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ప్రశ్నించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం రాత్రి నిర్వహించిన బహుజనుల ఓరుగల్లు పోరు గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలను కాన్షీరాం, మాయావతి మినహా ఎవరూ ముందుకు తీసుకెళ్లలేదన్నారు. అంబేడ్కర్‌తోనే రిజర్వేషన్లు, ఓటు హక్కు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోనే కొనసాగించాలని ప్రధానికి మాయావతి పలు సార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. ఖమ్మంలో వెలుగుమట్ల, హైదరాబాద్‌లో మూసిపేరిట పేదల ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. నాడు కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చేందుకు భూములు లేవని చెబుతూ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం భూములు ఇస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్దులకు ఇచ్చే పీజు రీయంబర్స్‌మెంట్‌పై కుట్ర జరగుతోందని, విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి వరంగల్ ఎంజీఎంను సందర్శించాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టుపై సాగదీత ఎందుకు అని శేఖర్ ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విశిష్ట అతిథి దాగిల్ల దయానంద్‌రావు, బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బష్కే నాగరాజు, ఉమ్మడి వరంగల్‌లోని వివిధ జిల్లాల అధ్యక్షులు ఎం.సదానందం, కల్పల నరేష్, చంద్రశేఖర్, విజ యకాంత్, నర్సయ్య, పార్లమెంట్ ఇన్‌చార్జ్‌లు వైనా ల కార్తీక్, బాధ్యులు వారికిల్ల మల్లేశ్, కాదాసి రవీందర్, తాండ్ర వెంకటేశ్వర్లు, శ్వేత, ఇందిర, ఉపేందర్ సాహు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ,
బీసీల వాటా ఎంత?
బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
కేడీసీలో బహుజనుల
ఓరుగల్లు పోరుగర్జన సభ


