అబ్దుల్లాపూర్‌మెట్ : ఔటర్ రింగ్‌రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితో పాటు రెండున్నరేళ్ల బాలుడు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ హనుమకొండకు చెందిన వేద ప్రకాశ్‌రెడ్డి (37) భార్య హిమబిందు, కుమారుడు అర్జున్ (2)తో పాటు బంధువైన దుర్గాప్రసాద్‌రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి మంగళవారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్‌లోని బొంగ్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్‌కేసర్‌లో ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు సాయంత్రం 4గంటల సమయంలో పెద్దఅంబర్‌పేట టోల్ గేట్ దాటి కొంత దూరంగా వెళ్లగానే అప్పటికే డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, అతని కుమారుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య హిమబిందు, బంధువైన దుర్గాప్రసాద్‌రెడ్డి, శ్రీజకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని డీఆర్‌డీఓ ఆ స్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడి న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
డివైడర్ మధ్యలో
మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు
తండ్రితో పాటు రెండున్నరేళ్ల కుమారుడు మృతి
మరో ముగ్గురికి
తీవ్రగాయాలు, పరిస్థితి విషమం


