● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ: సమసమాజ స్థాపకుడు డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర అద్వితీయమైందని, ఆయన దేశానికి మూలస్తంభం వంటివారన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సీజీఎం రవీంద్రనాథ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీకాంత్, హేమంత్ కుమార్, కళాధర్ రెడ్డి, కృష్ణ మోహన్, నాగ ప్రసాద్, వెంకట కృష్ణ, జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.


