
రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు..
ఆరోజు రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు. రజాకార్లంతా నాటుసారా తాగి గ్రామస్తులను ఒక్కచోట చేర్చి తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి చంపారు. చనిపోయినవారిని, గాయపడ్డవారిని గడ్డిలో వేసి నూనె పోసి కాల్చారు. నన్ను తీవ్రంగా కొట్టడంతో పారిపోయాను. నా కుటుంబంతో సహా కాంపెల్లి సమీపంలో అడవుల్లో ఆరు నెలలు దాక్కున్నాం.
– తేరాల గురవయ్య, పెరుమాళ్లసంకీస,
డోర్నకల్ మండలం
భయంతో వణికిపోయాం..
ఆ రోజు మా ఇంటి పక్కనే ఉన్న బందెలదొడ్డి వద్ద తుపాకుల కాల్పులు వినిపించడంతో భయంతో వణికిపోయాం. మానాన్న తుపాకీ గాయాలతో ఇంటికి వచ్చి కొంతసేపటికి చనిపోయాడు. తర్వాత అందరం ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలపాటు అడవుల్లో దాక్కున్నాం.
– గుడిమెట్ల రామక్క, పెరుమాళ్ల సంకీస, డోర్నకల్ మండలం

రజాకార్లు ఉన్మాదుల్లా ప్రవర్తించారు..