
అమాయకులను బలిగొన్న రజాకార్లు
పర్వతగిరి: ఖాసీంరజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు 1948 మార్చి 11 చౌటపల్లి గ్రామాన్ని చుట్టుముట్టారు. 21 మందిని నిర్బంధించి తుపాకులతో కాల్చి చంపారు. కొంతమంది ఇళ్లను తగులబెట్టారు. అదేవిధంగా కొంకపాక గ్రామం దొరల పాలనలో సాగింది. మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు తండ్రి తక్కళ్లపల్లి వెంకట్రాం నర్సయ్య ఆధీనంలో గ్రామం ఉండేది. దీంతో రజాకార్లు దొరలను టార్గెట్ చేశారు. వారి సంపదను దోచుకున్నారు. అడ్డువచ్చిన వారిని కాల్చి చంపారు. కొందరి ఇళ్లను దహనం చేశారు. ఈ ఘటనలో 15 మంది బలైపోయారు.