
లిఫ్టు ఇరిగేషన్‌కు
విద్యుత్ సరఫరా సిద్ధం
● ట్రాన్స్‌కో సీఈ రాజుచౌహాన్
కాటారం: చిన్న కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్‌లో భాగంగా గారెపల్లి పంప్‌హౌస్ కోసం నిర్మించిన సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో సీఈ రాజుచౌహాన్ తెలిపారు. ఎస్‌ఈ మల్చూర్‌తో కలిసి సీఈ లిఫ్టు ఇరిగేషన్ గారెపల్లి నూతన సబ్‌స్టేషన్‌ను మంగళవారం పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో అమర్చిన యంత్రాల వివరా లు, పవర్ లోడ్ కెపాసిటీ, సరఫరా ప్రక్రియ తదితర అంశాలపై ట్రాన్స్‌కో అధికారులతో ఎస్‌ఈ చర్చించారు. ప్రొటెక్షన్ వింగ్, టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో టెస్ట్ చార్జ్ చేశారు. అనంతరం లో ఓల్టేజ్ సమస్య నివారణలో భాగంగా మండల కేంద్రంలోని ఎర్రగుంటపల్లిలో అమర్చిన నూతన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను సీఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యు త్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నా ణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు సీఈ తెలి పారు. లో ఓల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు సీఎండీ ఆదేశాల మేరకు అవసరమైన చోట నూతన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఈఈలు పాపిరెడ్డి, సదానందం, ఏడీఈ నాగరాజు, ఏఈ ఉపేందర్, లైన్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కేసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మానుకోట జిల్లా కేసముద్రం మండలంలోని చంద్రుతండా జీపీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటగిరి సమీపంలోని చంద్రుతండా జీపీకి చెందిన చెందిన లకావత్ దేవా(35) వెంకటగిరి గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించేక్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న భగీరథ ఎయిర్‌వాల్ దిమ్మెను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గామైంది. దీంతో మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
గురుకులం ఆకస్మిక తనిఖీ
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డార్మెంటరీ, డైనింగ్ హాల్, గ్రంథాలయంతోపాటు తరగతి గదులను పరిశీలించారు. డార్మెంటరీ గదులు దెబ్బ తినడం వల్ల విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని డీఈఓ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థినులతో ఇంట్రాక్ట్ అయ్యారు. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు రాజకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

లిఫ్టు ఇరిగేషన్‌కు