
ప్రజాపాలన వేడుకలకు సన్నద్ధం
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజాపాలన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలోని కొత్త కలెక్టరేట్ పక్కన నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం ఉదయం పది గంటలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. సీటింగ్ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌రెడ్డి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో..
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో నేడు (బుధవారం) నిర్వహించే ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం, ప్ర సంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు.
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అన్నారు. కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై అధికారులు, ట్రేడర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 1,81,547 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వివరించారు. 11,85,470 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్లలో ఉన్న 27 జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల అధికారి మనోహర్ పాల్గొన్నారు.
శంభునిపేట పాఠశాలలో కృత్యమేళా
ఖిలా వరంగల్: వరంగల్ శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం కృత్యమేళా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద హాజరై 13 మండలాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు.