
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
కేయూ క్యాంపస్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో సైబర్‌నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అమాయకులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ.. మనకు తెలిసిన ముఖాలు తగిలించుకుని నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం సన్‌ప్రీత్‌సింగ్‌ను రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి శాలువా కప్పి సన్మానించారు. సమావేశంలో ఆకాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, సైబర్ క్రైమ్ ఏసీపీ కె.గిరికుమార్, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, నార్కొటిక్స్ ఇన్‌స్పెక్టర్ సతీశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.