కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు | - | Sakshi
Sakshi News home page

కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు

Sep 17 2025 9:16 AM | Updated on Sep 17 2025 9:16 AM

కేయూల

కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు

కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు డీవైఎస్‌ఓ అశోక్‌కు సాట్‌ వీసీఎండీ అభినందనలు నేటి నుంచి డిజిటల్‌ లెర్నింగ్‌పై టీచర్లకు శిక్షణ

కేయూ క్యాంపస్‌: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కేయూలోని ఎస్‌డీఎల్‌సీఈ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈశిబిరంలో ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యులు బి.తిరుపతి మాదిగ, అరెగంటి నాగరాజు, డి.తిరుపతి, మర్ర మహేశ్‌ రీసెర్చ్‌ స్కాలర్స్‌ కేతపాక ప్రసాద్‌, కందికొండ తిరుపతి, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు బొట్ల మనోహర్‌, ఎల్తూరి సాయికుమార్‌, ఉప్పుల శివ, కమ్మరి శ్రీనాఽథ్‌, ఎండెల రాకేశ్‌, బొక్క ప్రవర్ధన్‌, చింతం ఆంజనేయులు, శ్రీదేవి, స్రవంతి, శేఖర్‌, ఓర్సు చిరంజీవి విద్యార్థులు పాల్గొన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ క్రీడా సదస్సుకు హాజరుకానున్న హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వీసీఅండ్‌ ఎండీ సోనీబాలాదేవి, సాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సాట్‌ కార్యాలయంలో అశోక్‌ సాట్‌ వీసీఎండీ, చైర్మన్లను వారి ఆఫీసుల్లో మర్యాద పూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో సాట్‌ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యారణ్యపురి: డిజిటల్‌ లెర్నింగ్‌పై హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌, కేజీబీవీల, మోడల్‌ స్కూల్స్‌, టీఎస్‌ఆర్‌ఐఈఎస్‌లలోని గణిత, ఫిజికల్‌ సైన్స్‌ టీచర్లకు ఈనెల 17 నుంచి 19 వరకు మూడు రోజులు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ‘ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌’ అనే మోడ్యూల్‌పై ఈశిక్షణ ఇవ్వనున్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌, లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రెండుచోట్ల ఆయా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. 6వతరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించి డిజిటల్‌ లెర్నింగ్‌ పాఠ్యప్రణాళిక అంశాలపై రిసోర్స్‌పర్సన్లతో శిక్షణ ఇవ్వబోతున్నారు.

నాగేంద్రస్వామికి పూజలు

గీసుకొండ: మండలంలోని ఊకల్‌ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దంపతులు మంగళవారం పూజలు చేసి మొక్కులు సమర్పించారు. వారికి అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, శ్రీహర్ష ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మండల దీక్షలు చేపట్టిన స్వాముల కోసం అర్చకులు జ్యోతి పూజ నిర్వహించారు.

కేయూలో విద్యార్థి సంఘాల  నిరాహార దీక్షలు1
1/2

కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు

కేయూలో విద్యార్థి సంఘాల  నిరాహార దీక్షలు2
2/2

కేయూలో విద్యార్థి సంఘాల నిరాహార దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement