
వేతనాలకు ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏడాదిగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఏజెన్సీల అనుసంధానంతో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ‘ప్రభుత్వాన్ని అడగాలంటే వారి భర్తీతో పని చేయట్లేదు. పోనీ ఏజెన్సీని అడగాలంటే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయలేదు’ ఇలా ఏం చేయాలో పాలుపోక విధులు నిర్వహించాలా? వద్దా అనే మీమాంసలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.
విధులు ఇలా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా, షెరఫ్‌లుగా, అటెండర్లుగా సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. మధ్య వయస్సులోకి చేరుకున్న తామంతా మరో ఉద్యోగం చేయలేమని, ఏజెన్సీలకు ప్రభుత్వం బడ్జెట్‌ను రిలీజ్ చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కేవలం రెండు నెలలకు సరిపడే వేతనాలతో కూడిన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రకటించింది, కాగా, రాబోయే దసరా పండుగకై నా చేతికి డబ్బులు అందుతాయనుకుంటే.. ఇంకా బడ్జెట్ రిలీజ్ అయ్యి తమ ఖాతాల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్‌శాఖ
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు
అందని వేతనాలు
బడ్జెట్ ప్రకటించినా
చేతికందక ఇబ్బందులు