
ఆలయాల్లో శుద్ధి.. సంప్రోక్షణ
హన్మకొండ కల్చరల్ : సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆదివారం నగరంలోని పలు ఆలయాలను మూసివేశారు. సోమవారం ఉదయం ఆయా దేవాలయాల్లో గ్రహణ సంప్రోక్షణలు శుద్ధిచేసి దేవతామూర్తులకు అభిషేకం, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వేయిస్తంభాల దేవాలయంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీభద్రకాళి దేవాలయంలో ఆలయ వేదపండితులు పార్నంది నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రోక్షణలో భాగంగా హోమం నిర్వహించారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా దాతల సహకారంతో దేవాలయానికి రంగులు, సున్నాలు వేయించారు. వరంగల్‌లోని ఎంజీఎం ఎదురుగా గల శ్రీరాజరాజేశ్వరీదేవి దేవాలయంలో అర్చకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హన్మకొండ : అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుదామని, బీఆర్‌ఎస్ శ్రేణులకు లీగల్ సెల్ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, లీగల్ సెల్ హనుమకొండ, వరంగల్ జిల్లా బాధ్యులు కేటీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి లో యూరియా పంపిణీ, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం హనుమకొండ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని లీగల్ సెల్ బృందం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గులాబీ శ్రేణుల పక్షాన పార్టీ లీగల్ సెల్ పోరాడుతుందని అన్నారు. అక్రమ కేసులకు భయపడబోమని, బీఆర్‌ఎస్ శ్రేణులకు ఉద్యమాలు కొత్త కాదని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ సెల్ బాధ్యులు, సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ఆలయాల్లో శుద్ధి.. సంప్రోక్షణ

ఆలయాల్లో శుద్ధి.. సంప్రోక్షణ

ఆలయాల్లో శుద్ధి.. సంప్రోక్షణ