
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
● 11వ తేదీ నుంచి అమల్లోకి..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణికుల సౌకర్యార్థం దసరా, దీపావళి పండుగల సందర్భంగా చర్లపల్లి–ససరమ్ మధ్య 22 ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు చర్లపల్లి–ససరమ్ (07021) మధ్య 11 ప్రత్యేక రైళ్లు ప్రతీ గురువారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తాయి. అదేవిధంగా సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ససరమ్–చర్లపల్లి (07022) మధ్య 11 ప్రత్యేక రైళ్లు ప్రతీ శనివారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తాయి. 1 –ఏసి, 2 –ఏసి, 3 –ఏసి, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకంగ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్‌లకు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపరియా, మదన్ మహల్, కట్నీ, సంత, మణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్, దీన్‌దయాల్ ఉపాధ్యాయ స్టేషన్‌లలో హాల్టింగ్ కల్పించినట్లు ఆయన తెలిపారు.
పలు స్టేషన్లలో హాల్టింగ్ కొనసాగింపు
కాజీపేట జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తాత్కాలిక హాల్టింగ్‌లను కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
హాల్టింగ్ స్టేషన్లు ఇవే
దానాపూర్–సికింద్రాబాద్ (12792) దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు జమ్మికుంట, నర్సాపూర్–నాగర్‌సోల్ (12787) ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్, నాగర్‌సోల్–నర్సాపూర్ (12788) ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్, పూణె–కాజీపేట (22151) ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల, కాజీపేట–పూణె (22152) ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.