
క్యూలో పాస్‌బుక్కులు!
మండలంలోని సిద్ధాపురం సొసైటీకి మంగళవారం రైతులు క్యూకట్టారు. రాత్రి యూరియా లారీ సొసైటీకి చేరుకోవడంతో బుధవారం ఉదయం యూరియా విక్రయిస్తారని భావించిన రైతులు అక్కడకు భారీగా చేరుకుని పట్టాదార్ పాస్‌పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలైన్‌లో పెట్టారు. ఇప్పటివరకు చెప్పులు లైన్‌లో పెట్టిన రైతులు ఈసారి పట్టాదార్ పాస్‌పుస్తకాలు పెట్టడం గమనార్హం. అయితే కొంతమంది రైతులు అర్ధరాత్రి వరకు అక్కడ నిరీక్షించి ఇంటి దారిపట్టగా, మరికొంత మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కునుకు తీసినట్లు స్థానికులు చెప్పారు. –హసన్‌పర్తి